తాడిచెర్లలో తల్లిపాల వారోత్సవాలు

Breastfeeding week celebrations in Tadicherlaనవతెలంగాణ – మల్హర్ రావు
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో అంగన్ వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు అంగన్ వాడి టీచర్లు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడారు తల్లి పాల ప్రాముఖ్యతపై వివరించారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలు పట్టిస్తే రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నారు.బిడ్డకు తల్లిపాలే సురక్షితంగా,పుష్టికారంగా అన్ని రకాల పోషకాలు అందుతాయన్నారు.పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు తప్ప వేరే ఇతర ద్రవపదార్థాలు ఇవ్వరాదన్నారు.అనంతరం డబ్బా పాలు వద్దు…అమ్మ పాలు ముద్దు అనే నినాదంతో ర్యాలీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో  అంగన్ వాడి టీచర్లు అరుణ, జయప్రద, వెంకటమ్మ నారమ్మ,, ఆయాలు పాల్గొన్నారు.