బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం..

నవతెలంగాణ మునుగోడు: 
మండలంలోని దుబ్బాకాల్వ నుండి కొరటికల్ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం ఉన్న పెద్ద వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మూడు కోట్ల 46 లక్షలు నిధులు మంజూరు కావడంతో సోమవారం పనులను ప్రారంభించారు. ఆ రహదారి వెంట ప్రయాణం చేసే వాహనాదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు మందుల బీరప్ప, కొరటికల్ గ్రామ శాఖ అధ్యక్షులు దండు లింగస్వామి, చిలక రాజు నరసింహ, అరగంటి పాపయ్య, దండు నరసింహ, బొడ్డుపల్లి వెంకట్, యాదయ్య, కూరెళ్ళ యాదగిరి, పి సైదులు, బి.చందు తదితరులున్నారు.