చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌

– రఘునాథ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్కూల్‌ బ్యాగుల పంపిణీ
నవతెలంగాణ-మియాపూర్‌

విద్యార్థులు ఇష్టంగా చదువుకోవాలని, చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని రఘునాథ్‌ ఫౌండేషన్‌ తెలిపింది. మంగళవారం శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రఘునాథ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్కూల్‌ బ్యాగులు పంపిణీ చేశారు. అనంరతం మారబోయిన రఘునాథ్‌ మాట్లాడుతూ రేపటి దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులకు చేయూతనివ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ మోసుకెళ్లే స్కూల్‌ బ్యాగులు వారి భవిష్యత్‌ను మోసుకెళ్లే వారధుల్లాంటవని అన్నారు. విద్యార్థులంతా ఇష్టపడి చదు వుతూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. దేశ నిర్మాణం విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. ఆర్థిక వనరులు లేక ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో విద్యార్థులకు తనవంతు సహాయం అందజే స్తున్నట్టు తెలిపారు. విద్యార్థులతో సరదాగా ముచ్చ టించారు, థాంక్యూ రఘు అన్న అంటూ స్కూల్‌ వాతా వరణం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవింద్‌, శ్రావణ్‌గౌడ్‌, కుమార్‌సాగర్‌, భరత్‌, పవన్‌, శ్రీకాంత్‌ నాయక్‌, హమీద్‌, బాబా, వినోద్‌ యాదవ్‌, రఘునాథ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.