తెల్లారినా వెలుగుతున్న వీధిలైట్లు

నవతెలంగాణ – మోర్తాడు

మండల కేంద్రంలోని డివైడర్ స్ట్రీట్ లైట్లను తెల్లవారుజామున ఆర్పాల్సిన వారు అర్పకపోవడంతో ఉదయం 9 గంటల వరకు అలాగే కొనసాగాయి. రాత్రి సమయంలో వెలిగిస్తూ ఉదయం ఆరుపాల్సిన సిబ్బంది వాటిని బందు చేయకపోవడంతో సుమారు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన డివైడర్ స్ట్రీట్ లైట్లు అలాగే కొనసాగాయి. స్థానికులు వాట్సాప్ గ్రూప్ లలో వైరల్ చేయడంతో అధికారులు వీధిదీపాలను ఆర్పివేశారు. గ్రామపంచాయతీ పై భారం పడకుండా ఉండడానికి అధికారులు రాత్రి సమయంలో వెలిగిస్తూ ఉదయం తెల్లవారుజామునే వాటిని బందు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. పంచాయతీపై కరెంట్ బిల్లు భారం పడకుండా ఒక సిబ్బందిని నియమిస్తూ వాటిని ఎప్పటికప్పుడు పరిశీలన చేయించాలని స్థానికులు కోరుతున్నారు.