– మహ్మద్ రియాన్‌కు ఐఆర్‌ఎల్ టైటిల్
చెన్నై: ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్)లో చెన్నై టర్బో రైడర్స్ డ్రైవర్ మహ్మద్ రియాన్ తొలి విజయం సాధించాడు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్‌ఎఫ్)లో భాగంగా చెన్నైలోని రేసింగ్ ట్రాక్‌లో జరుగుతున్న పోటీల్లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ డ్రైవర్ అఖిల్ అలీభారు మెప్పించాడు. నాల్గో రేసులో అగ్రస్థానంలో నిలిచిన అఖిల్ 24.37.329 సెకండ్లలో రేసును ముగించాడు. ఫార్ములా 4 రేసుల్లో భాగంగా జరిగిన మూడు రౌండ్ల రేసుల్లో ముగ్గురు విజేతలుగా నిలిచారు. తొలి రేసులో మహ్మద్ రియాన్, రెండో రేసులో రుహాన్ అల్వా, మూడో రేసులో వీర్ సేత్, నాల్గో రేసులో అఖిల్ అగ్రస్థానం సాధించారు. రెండో రేసులో సైతం మెప్పించి రెండో స్థానంలో నిలిచిన అఖిల్ భారు..ఓవరాల్‌గా మెడల్ పోడియంపై రన్నరప్‌గా నిలిచాడు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ నాల్గో రౌండ్ పోటీలు అక్టోబర్ 19-20న కోయంబతూర్‌లో జరుగున్నాయి.