మెరిసిన దబంగ్‌ ఢిల్లీ

Brilliant Dabangg Delhi– 33-30తో బెంగాల్‌పై గెలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ పుంజుకుంది. ఏడు మ్యాచుల్లో ఐదు పరాజయాలు చవిచూసిన దబంగ్‌ ఢిల్లీ.. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌పై 3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ప్రథమార్థంలో 19-13తో భారీ ఆధిక్యంలో సాధించిన దబంగ్‌ ఢిల్లీ.. ఆఖరు వరకు ఆధిక్యం నిలుపుకుంది. 33-30తో బెంగాల్‌ వారియర్స్‌పై మెరుపు విజయం నమోదు చేసింది. స్టార్‌ రెయిడర్‌ ఆషు మాలిక్‌ (10) సూపర్‌టెన్‌ షోతో మెరువగా.. వినరు (8), ఆశీష్‌ (6) మెప్పించారు. బెంగాల్‌ వారియర్స్‌ తరఫున నితిన్‌ కుమార్‌ (15) పోరాడినా ఫలితం దక్కలేదు. బెంగాల్‌ వారియర్స్‌కు సీజన్లో ఇది రెండో పరాజయం. బెంగాల్‌ ఆరు మ్యాచుల్లో రెండు నెగ్గి, రెండు మ్యాచులను టై చేసుకుంది.