మెరిసిన మహ్మద్‌ షమి

మెరిసిన మహ్మద్‌ షమి– మధ్యప్రదేశ్‌పై 4 వికెట్ల ప్రదర్శన
ఇండోర్‌ : స్టార్‌ పేసర్‌ మహ్మద్‌షమి రీ ఎంట్రీలో మెప్పించాడు. బెంగాల్‌ తరఫున రంజీ ట్రోఫీ బరిలో నిలిచిన మహ్మద్‌ షమి.. ఎలైట్‌ గ్రూప్‌-సిలో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. సుమారు ఏడాది తర్వాత రీ ఎంట్రీలో 19 ఓవర్లలో 54 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. షమి మెరుపులతో మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలోనే 167 పరుగులకు కుప్పకూలింది. అంతకుముందు బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులు చేసింది. బెంగాల్‌ రెండో ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో 170/5తో కొనసాగుతుంది. ప్రస్తుతం బెంగాల్‌ 233 పరుగుల ముందంజలో నిలిచింది. వృద్దిమాన్‌ సాహా (21 నాటౌట్‌), ఛటర్జీ (33 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు.