హైదరాబాద్ : 67వ జాతీయ స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ స్విమ్మర్ వ్రిత అగర్వాల్ మెరిసింది. న్యూఢిల్లీల జరిగిన పోటీల్లో అండర్-19 బాలికల విభాగంలో రెండు బంగారు పతకాలు కొల్లగొట్టింది. 800మీ ఫ్రీస్టయిల్, 400మీ ఫ్రీస్టయిల్‌లో వ్రితి అగర్వాల్ పసిడి ప్రదర్శన చేసింది. వ్రితి అగర్వాల్‌ను జియాన్‌స్పోర్ట్స్ డైరెక్టర్, కోచ్ జాన్ సిద్ధికి అభినందించారు.