చిత్రలేఖనంలో బ్రిలియంట్ విద్యార్థి ప్రతిభ

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
విద్యార్థుల్లోని శాస్త్రీయ దృక్పథాన్ని,ప్రతిభను వెలికి తీసేందుకుపోటీలు ఉపయుక్తంగా ఉంటాయని, బ్రిలియంట్ స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి నక్క కృష్ణయ్య అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని  బచ్ ఫన్ హై స్కూల్లో పర్యావరణ పరిరక్షణ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో’ సుస్థిర భవిష్యత్తుకు విజ్ఞాన శాస్త్రం అనే అంశంలో’ చిత్రలేఖన విభాగంలో బ్రిలియంట్ స్కూల్ కి చెందినటువంటి బి జషశ్విని ప్రథమ బహుమతి గెలుపొందినట్లు జిల్లా సైన్స్ అధికారి అయినటువంటి భరణి  ప్రకటించారు. ఈ  కార్యక్రమంలో,కూరెళ్ళ శ్రీనివాస్ ,పో రెడ్డి రంగయ్య,జయలక్ష్మి ,నరసింహ చారి,రమేష్, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.ఇందుకుగాను బ్రిలియంట్ స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి నక్క కృష్ణయ్య  గారు మరియు హమీద్,రాణి రాజు శ్రీశైలం,Y. మాధవి G.మాధవి పాఠశాలలోని ఉపాధ్యాయ ఉపాధ్యాయనీలు అభినందించారు.