రాయపర్తి గ్రామానికి, కాకతీయుల కాలం నాటి ఘన చరిత్ర కలిగిన మంచినీళ్ల చెరువుకు పెను ప్రమాదంగా శ్రీ సత్య నారాయణ స్వామి హచరీస్ ఉందని గత కొంతకాలంగా “నవతెలంగాణ” దిన పత్రికలో పలు కథనాలు ప్రచురితం కావడంతో గ్రామ యువత ముందుకు వచ్చి గ్రామ పరిరక్షణ కమిటీగా ఏర్పడి సేవ్ మంచినీళ్ళ చెరువు అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెరువును సందర్శించారు. చెరువు నీళ్లు దుర్గంధం వెదజల్లడానికి కారణాలను, పౌల్ట్రీ హచరీస్ నుండి వచ్చే వ్యర్ధాలను నిర్మూలించడానికి స్థానికులతో మాట్లాడారు. తదుపరి సంబంధిత శాఖ అధికారులతో ఫోనులో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన చెరువుకు పూర్వ వైభవం తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని హుకుం జారీ చేశారు.
పౌష్టికాహారం ఆహారం నాణ్యమైన విద్య అందించాలి
విద్యార్థినిలకు పౌష్టిక ఆహారం నాణ్యమైన విద్యను అందించాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో ఉన్న కేజీవిపి హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థినిలతో మాట్లాడారు. వంట గదిని పరిశీలించి వండిన భోజనాన్ని విద్యార్థినిలకు వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులకు దూరంగా ఉండే విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రేమ ఆప్యాయతతో ఉండాలన్నారు. బాలికల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. విద్యార్థినీలు చదువులో ఉన్నతంగా రాణించి హాస్టల్ కు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వ్యాఖ్యానించారు. ఆమెతో పాటు తొర్రూరు బ్లాక్ అధ్యక్షులు హమ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రెడ్డి, ముద్రబోయిన వెంకన్న, ఉల్లెంగుల నర్సయ్య, గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.