బద్దకించిన కంటోన్మెంట్‌ ఓటర్లు

బద్దకించిన కంటోన్మెంట్‌ ఓటర్లు– సాయంత్రం 5 గంటల వరకు 47.88 శాతం పోలింగ్‌
– మరికొంత పెరిగే అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లోక్‌సభతో పాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో నగర ఓటర్లు బద్దకించారు. సాయంత్రం 5 గంటల వరకు 47.88 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. మరో రెండు నుంచి మూడు శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 6.28 శాతం పోలింగ్‌ నమోదు కాగా, 9 గంటల నుంచి 11 గంటల వరకు 16.34 శాతం నమోదైంది. ఎప్పటిలాగే తక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది. ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తో ముఖాముఖి నెలకొన్న ఈ నియోజక వర్గంలో ఇండిపెండెంట్లతో కలిపి మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. లోక్‌సభతో పాటే జూన్‌ 4న కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఫలితాలు వెల్లడి కానున్నాయి.