– మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ గెలుపు
చెస్టర్ లీ స్ట్రీట్(ఇంగ్లండ్): ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 46పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 305పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 37.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగుల వద్ద ఉండగా.. భారీ వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ గెలుపు ఖాయమైంది. బ్రూక్స్(110నాటౌట్) విల్ జాక్స్(84), లివింగ్‌స్టోన్(33) బ్యాటింగ్‌లో రాణించారు. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్లు స్టీవ్ స్మిత్(60), అలెక్స్ క్యారీ(77) అర్ధసెంచరీలకి తోడు హార్డీ(44), గ్రీన్(42), మ్యాక్స్‌వెల్(30) బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. భారీ ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో 11 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజ్‌లోకి దిగిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 94 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బ్రూక్స్‌్‌కు లభించగా.. నాల్గో వన్డే లండన్ వేదికగా శుక్రవారం జరగనుంది.