తమ్ముడిని హత్య చేసిన అన్న

– ఆస్తి తగాదాలే కారణం?
– కార్యకర్త పాడే మోసిన ఎమ్మెల్యే హనుమంతు షిండే
నవతెలంగాణ-మద్నూర్‌
తమ్ముడిని అన్న హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం సోనాల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మద్నూర్‌ ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోనాల గ్రామానికి చెందిన టాక్లే విజరు(32)ను ఆస్తి తగాదాల కారణంతో అతని అన్న తాకలే రాజు కత్తితో పొడిచి కిరాతంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కృష్ణారెడ్డి, బిచ్కుంద సీఐ కృష్ణ, బాన్సువాడ డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా హత్యకు గురైన టాక్లే విజరు సోనాల బీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ అధ్యక్షులు. ఆయన హత్య విషయాన్ని తెలుసుకున్న జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంతు షిండే హుటా హుటినా సోనాల గ్రామాన్ని సందర్శించారు. నాయకుని హత్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొని విజరు పాడేను మోశారు.