ఇరకాటంలో బెల్ట్.?

– కోడ్ తో బెల్టుషాపులు మూసివేత
– తెరిస్తే కేసులే
నవతెలంగాణ -మల్హర్ రావు
కరువమంటే కప్పకు కోపం..విడువమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది.బెల్టుషాపుల నిర్వాహకుల పరిస్థితి. ఎన్నికల కోడ్ కారణంగా గ్రామాల్లో ఇదివరకు నిర్వహించిన బెల్టుషాపులను మూసివేయాలని,కొనసాగికచవద్దని ఎన్నికల అధికారులు ఎక్సైజ్,పోలీస్ అధికారులు ఆదేశించారు. తమతో వేలంపాట సమయంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం బెల్టుషాపులను నిర్వహించాల్సిందేని పలు గ్రామాల అభివృద్ధి కమిటీలు చెబుతున్నాయి. దీంతో బెల్టుషాపుల నిర్వాహకుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. ఒక వేళ తమ ఆదేశాలను కాదని బెల్టుషాపులను నిర్వహిస్తే మద్యాన్ని సీజ్ చేయంతోపాటు నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నియంత్రించాలానే ఉద్దేశంతో…
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో మద్యం అమ్మకాలను నియంత్రించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎక్సైజ్ విశాఖ,టాస్క్ పోర్స్, స్పెషల్ పార్టీ, ఎన్నికల కమిషన్ నియమించిన సర్వైవల్ బృందాలు ప్రత్యేక నిఘా బృందాలు గ్రామాల్లో దాడులు నిర్వహిస్తూ మద్యం అమ్మకాలను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నాయి.ఇప్పటికే పలు గ్రామల్లోని బెల్టుషాపులపై పలు దాడులు నిర్వహించి మద్యం సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
అక్రమ మథ్యంపై నిఘా..
ఎన్నికల వేళ అక్రమ మద్యమం అమ్మకాలు నిల్వలు పెరుగుతుంటాయి.ప్రజలను ప్రలోభాలకు గురిచేసే వాటిలో మద్యం ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందని గుర్తించిన అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.ఎన్నికల్లో అక్రమ మద్యమాన్ని అరికట్టాలని ఎన్నికల నోటిఫికేషన్ రాగానే సమయత్తమై ఎక్సైజ్, ట్రాస్క్ పోర్స్ ఆధ్వర్యంలో దాడులు,వాహనాల తనిఖీలు చేపడుతూ కేసులు నమోదు చేస్తున్నారు.ఎన్నికలు పూర్తియ్యే వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అక్రమ మద్యమం అమ్మకాలు,నిల్వలను అరికడతామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టోల్ ప్రి నెంబర్ 8019263862, టోల్ ప్రి నెంబర్ 1800-425-2523 ఏర్పాటు చేశారు.