వేములవాడ పట్టణంలోని ఓకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఏడుగురు విద్యార్థులు బ్రౌన్ బెల్టులు లో సాధించినట్లు కరాటే కోచ్ అబ్దుల్ మన్నాన్ తెలిపారు. కరీంనగర్ గురువారం రాత్రి కరీంనగర్లో జరిగిన బ్రౌన్ బెల్టుల గ్రేడింగ్ టెస్ట్ లో కటాస్, అంశాలపై ప్రతిభ కనబరిచి బ్రౌన్ బెల్ట్ సాధించిన వారిలో కె. సాయి మనీ హర్షిత్, కె. సాయి మని రూప్, యు, పవన్ రాజ్ , సిహెచ్ సూర్య సుశీల్, జి. వివేక శ్రీ, వి. శి వహిత, వి. శ్రీహర్స్ ఉన్నారు. వీరికి ఓకినావా కరాటే స్కూల్ తెలంగాణ చీఫ్ కే వసంత్ కుమార్ బ్రౌన్ బెల్టులు తో పాటు సర్టిఫికెట్లు అందజేసినట్టు మన్నాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ లు ఎం. తిరుపతి, అర్జున్ సింగ్ ఠాగూర్, రాజశేఖర్, మొహమ్మద్ మోసీన్ తోపాటు తదితరులు ఉన్నారు.