నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని అమ్రాబాద్ తదితర గ్రామాలలో జెడ్పీటీసీ కమల నరేష్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతు కావాలంటే బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించుకోవాలని అటువంటి నాయకుడు పార్లమెంట్లో ఉంటే మన జిల్లాకు నిధులతో పాటు రైల్వే లైన్ ఏర్పాటు కూడా ఆయనతోటే సాధ్యమవుతుందని, ముఖ్యంగా మన రూరల్ నియోజకవర్గం బిడ్డ పార్లమెంట్ కు పంపాలంటే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, కుల రాజకీయాలు చేసే మత రాజకీయాలు చేసే పార్టీలకు ఓటు వేయకుండా ప్రజల కోసం పాటుపడి నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి మన గోవన్న న అటువంటి వ్యక్తిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించే బాధ్యత మన అందరి పైన ఉండాలని ఆయన తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూడా టిఆర్ఎస్ ఎంపీలు అత్యధికంగా గెలవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో న్యాయకల్ శ్రీనివాసరావు, ఉమాపతిరావు, మాజీ సర్పంచ్ ముత్యంరెడ్డి, కంజర్ భూమయ్య, మోచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.