– అబ్రహంకు నిరాశ- విజయుడుకు టిక్కెట్
– మొత్తం 119 స్థానాలకు బీ-ఫామ్‌ల అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నామినేషన్ల ఘట్టం ఊపందుకున్న వేళ అధికార బీఆర్‌ఎస్… ఇంతకుముందు ఆలంపూర్ అభ్యర్థిగా ప్రకటించిన అబ్రహాంకు షాక్‌నిచ్చింది. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి అనుయాయుడు విజయుడుకు ఆ స్థానాన్ని కేటాయించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు మంగళవారం బీ-ఫామ్‌ను అందజేశారు. దీంతోపాటు చాంద్రాయణగుట్ట నుంచి ఎం.సీతారాం రెడ్డికి, యాకుత్‌పూరా నుంచి సామా సుందర్‌రెడ్డికి, బహదూర్‌పూరా నుంచి ఇనాయత్ అలీబాక్రీకి, మలక్‌పేట నుంచి తీగల అజిత్‌రెడ్డికి, కార్వాన్ నుంచి అయిందాల కృష్ణకు, చార్మినార్ నుంచి సలావుద్దీన్ లోడీకి, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనందకుమార్ గౌడ్‌కు, గోషామహల్ నుంచి నందకిషోర్ వ్యాస్‌కు టిక్కెట్లను ఖరారు చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయగా… కేటీఆర్ బీ-ఫారాలను అందజేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ మొత్తం 119 స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఖరారు చేసి… బీ- ఫారాలను అంద జేసింది.