– కవితను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోం :జాఫర్ ఇస్లాం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యూపీఏకు ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా బీఆర్‌ఎస్ ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత అవినీతిపై విచారణ జరుగుతున్నదనీ, విచారణ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని చెప్పారు. అవినీతికి పాల్పడిన కవితను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కుటుంబ పాలన, అవినీతి గురించే బీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఆలోచిస్తాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అంటే బ్రష్టాచార్ రిస్తేదార్ పార్టీ అని విమర్శించారు. కర్నాటకలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున డబ్బులు పోగేసి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు పంపుతున్నారని ఆరోపించారు.