నవతెలంగాణ-బెజ్జంకి: 60 ఎండ్ల కాంగ్రెస్,10 ఎండ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలందరం చూసామని.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలు నీటి మూటలేనని మానకొండూరు. నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ అన్నారు. గురువారం మండల పరిధిలోని గుగ్గీల్ల, గాగీల్లపూర్, రేగులపల్లి, చీలాపూర్ గ్రామాల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరెపల్లి మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ మండలాధ్యక్షుడు కొలిపాక రాజు, నాయకులు చాడ వెంకట రెడ్డి, బామండ్ల జ్యోతి, ముస్కె మహేందర్, బుర్ర మల్లేశం, గైని రాజు, సంగ రవి, దీటి రాజు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.