
– దాడిలో గాయపడిన రాజేందర్ కు కాంగ్రెస్ నాయకుల పరామర్శ
నవతెలంగాణ-బెజ్జంకి
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ పథకం ప్రకారమే స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కాంగ్రెస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,మానకొండూర్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కవ్వంపల్లి ఆరోపించారు. దాడిలో గాయపడిన మండల కేంద్రానికి చెందిన బోనగిరి రాజేందర్ను కవ్వంపల్లి సత్యనారాయణ మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడారు. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన సాగర్ పై,బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన బోనగిరి రాజేందర్ పై బీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడ్డారని నేడు వెలువడే ఎన్నికల పలితాల్లో నియోజవర్గ ప్రజలు బీఆర్ఎస్ నాయకులకు దేహశుద్ది చేస్తారని హితవు పలికారు.దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకులపై పోలీసులకు పిర్యాదు చేశామని క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి దాడులకు పాల్పడిన వారిపై అధికారులు నిష్పక్షపాతంగా చర్యలు చేపట్టాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు. మండల కాంగ్రెస్ నాయకులు, ఇల్లంతకుంట ఎంపీపీ వెంకట రమణ రెడ్డి హజరయ్యారు.