కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు

– సాదరంగా ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం డివిజన్ లోని బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మహదేవ్ పూర్ మండలంలోని సండ్రువెళ్లి, మహా ముత్తరం మండలంలోని వజినపెల్లి, బొర్లగూడెం గ్రామాల నుండి దాదాపు 40 మంది బీఆర్ఎస్, బీజేపీ పార్టీ ల నుండి కాంగ్రెస్ పార్టీ చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.