బీఆర్‌ఎస్‌తోనే ప్రజల జీవితాల్లో వెలుగులు

– 24 గంటల విద్యుత్‌ కావాలో..5గంటల విద్యుత్‌ కావాలో తేల్చుకోండి
– కాంగ్రెస్‌ వస్తే చీకట్లు, కరువు తప్పదు
– బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేది బీఆర్‌ఎస్సే.24 గంటల విద్యుత్‌ కావాలో…కాంగ్రెస్‌లో ఇస్తామంటున్న 5 గంటల విద్యుత్‌ కావాల్లో ప్రజలే తేల్చుకోవాలని బీఆర్‌ఎస్‌ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.సోమవారం చివ్వెంల మండలకేంద్రంలో, కోటినాయక్‌తండా, గాయంవారిగూడెం, వాల్యతండా, వట్టి ఖమ్మంపహాడ్‌, పాచ్యానాయక్‌ తండా, చందుపట్లలో జగదీశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ అంశం పై ఇంకా కాంగ్రెస్‌ నాయకులు గ్లోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.కర్నాటకలో కాంగ్రెస్‌ 5గంటలే విద్యుత్‌ ఇస్తుందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలే ఆ పార్టీ చేతగాని తనానికి నిదర్శనమన్నారు.కుమారస్వామి వ్యాఖ్యలతో మరో సారి కాంగ్రెస్‌ పనితనం బయట పడిందన్నారు.కావాలంటే కర్నాటకలో 18 గంటలు విద్యుత్‌ వైర్లు పట్టుకుని నిలబడతా తెలంగాణాలో మీరు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.ధైర్యం ఉంటే తెలంగాణాలో కరెంట్‌ తీగలు పట్టుకుని కాంగ్రెస్‌ నేతలు ఓట్లడగాలని సవాల్‌ విసిరారు.విద్యుత్‌ తీగలు పట్టుకుంటే కాంగ్రెస్‌ నేతలకు నిజాలు తెలుస్తాయన్నారు. కాంగ్రెస్‌ వస్తే చీకట్లు, కరువు తప్పదన్నారు.పోయిన కాంగ్రెస్‌ను మళ్లీ రానివ్వకుండా ఊరి బయట నుండే తరిమివేయడానికి ప్రజలు సిద్ధపడుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండలఅధ్యక్షులు జూలకంటి జీవన్‌రెడ్డి, ఎంపీపీ ధరావత్‌ కుమారిబాబునాయక్‌, జెడ్పీటీసీ భూక్యాసంజీవ్‌ నాయక్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ మారినేని సుధీర్‌రావు, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు,గుర్రం సత్యనారాయణరెడ్డి,బీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షులు రావిచెట్టు సత్యం, జటంగి వెంకటేశ్వర్లు, రామగిరి నగేష్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.