– 14 సంవత్సరాలు వనవాసం విడీ సొంత పార్టీకి వచ్చిన..
– బీఆర్ఎస్ నాయకుడు జిట్ట బాలకృష్ణారెడ్డి..
నవ తెలంగాణ- భువనగిరి: తెలంగాణలో మూడవ సారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే, బీఆర్ఎస్ నాయకులు సమిష్టిగా కలిసికట్టుగా ఉండి పార్టీ గెలుపు కోసం అందరూ శ్రమించాలని, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన ఫామ్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబందుల నుంచి రాష్ట్రాన్ని కాపాడలంటే, ఉద్యమకారులు, తెలంగాణ వాదులు ఏకం కావలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. కెసిఆర్ అధికారంలోకి వస్తేనే సబ్బండ వర్గాలకు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర లాల్లో ఇంతవరకు అభివృద్ధి నోచుకోలేదని మండిపడ్డారు. 14 సంవత్సరాల నుండి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గుగ్గిపాలు చేసే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలలో పోరాటం చేసి చనిపోయిన వ్యక్తుల విగ్రహాలు హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టాపించిన ఘనత కెసిఆర్ కి దక్కుతుందని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బీబీనగర్ నిమ్స్ హ స్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేయకుండా గాలికి వదిలేసారని చెప్పారు. కెసిఆర్ అధికారంలోకి రాగానే బీబీనగర్ నిమ్స్ పై ప్రత్యేక చొరవ చూపి పూర్తి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ప్రస్తుతం అనేకమంది పేద ప్రజల కుటుంబాలు ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొంది వ్యాధులను నయం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రెండవ తిరుపతి అయినా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్ కే దక్కిందని అన్నారు. త్రిబుల్ ఆర్ బాధితులు ఎవరు అసహనం చెందవద్దన్నారు. అందరికీ సరైన న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో గెలిచి కెసిఆర్ కు హుమతిగా ఇవ్వాలని, అందులో భువనగిరి, ఆలేరు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బుదవారం వేములకొండ దైవ దర్శనం చేసుకొని ప్రచారం మొదలుపెడతామని అన్నారు. ఏకదటగా 14 సంవత్సరాలు వనవాసం జరిపి ఇప్పుడు సొంత పార్టీకి రావడం ఎంతో సంతృప్తి నిస్తుందని అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. త్వరలోనే మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాదవ రెడ్డి, సినియర్ నాయకులు చింతల వేంకటేశ్వర రెడ్డి, తనతో పాటు ప్రచారం నిర్వహించి ప్రజల ఆశ్వీరదంతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ని అత్యధిక మేజర్టీ తో గేలుపింస్తామన్నారు.