
రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లిం సోదరులకు బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం భువనగిరిలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమానత్వం లౌకికవాదంతో ముందుకు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.