మరోసారి ఆశీర్వదిస్తే ప్రజాసేవకు అంకితం అవుతానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

నవతెలంగాణ-జక్రాన్ పల్లి: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మరోసారి ఆశీర్వదిస్తే ప్రజాసేవకు అంకితం అవుతారని బీఆర్‌ఎస్‌ నిజాంబాద్ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం అన్నారు.  నియోజకవర్గ ప్రజల మీద సీఎం కేసీఆర్ కు ప్రేమ బలం ఉన్నదని దీంతో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. భారీ మెజారిటీతో తనని గెలిపిస్తే   ఇంకా మరింత అభివృద్ధి చేస్తానని శనివారం రోజున  పుప్పలపల్లి, మాదాపూర్, గన్యతండ, సికింద్రాబాద్, బాల్ నగర్, కేశ్ పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బాజిరెడ్డి గోవర్ధన్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు మహిళలు మంగళ హారతులతో బోనాలతో స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేసిన అభివృద్ధి వివరిస్తూ మేనిఫెస్టోలో అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్‌ఎస్‌ అయంలో చేసిన అభివృద్ధి పనుల ముందే కనిపిస్తుండడంతో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన అభివృద్ధి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయంలోనే జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని వారు చేసింది ఏమీ లేదన్నారు. గ్యారెంటీ హామీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారు అమలు చేయక ఆరు నెలల్లోనే పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. అక్కడి నాయకులు తెలంగాణలోకి వచ్చి  గ్యారెంటీ హామీలతో మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ప్రజలు మరి మాటలు నమ్మొద్దని సూచించారు. బీజేపీ కాంగ్రెస్ల మాయమటలకు మోసపోవద్దని మోసపోతే గోసపడతామని  పేర్కొన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ వ్యక్తిత్వం గురించి బస్ కండక్టర్ను బస్ డ్రైవర్ని రాష్ట్రంలో ఎక్కడ ఆపిన అడిగిన తన గురించి చెప్తారని రేవంత్ రెడ్డి ఘాటుగా  విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ను మల్లి గెలిపిస్తే రైతుబంధు పెట్టుబడి సాయాన్ని 16,000  పెంచుతామని.  బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఎన్నికల తర్వాత కట్ అప్డేట్ ని పొడిగించి బీడీ కార్మికులందరికీ పించను  అందేలా సీఎం కెసిఆర్ చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా 3000 సాయం అందిస్తామని చెప్పారు. ఆసరా పింఛను 5016 వరకు పెంచుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కుంచాల విమల రాజు, జడ్పిటిసి తనుజ శ్రీనివాస్ రెడ్డి,  వైస్ ఎంపీపీ ముసుకు తిరుపతిరెడ్డి, మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు నట్ట భోజన్న, మండల కోఆప్షన్ సభ్యుడు బుల్లెట్ అక్బర్ ఖాన్ మండల రైతు బంధు అధ్యక్షులు డికొండ శ్రీనివాస్, సర్పంచులు దావుల పోసాని సంతోష్,  గన్యా తండా  నూర్ సింగ్ రాథోడ్, సికింద్రాపూర్ సర్పంచ్ తలారి గంగ మణి గంగాధర్, కందుల చిన్న లింగన్న,   మైదం మహేశ్వర్, ఒల్లపు నిహారిక ఈశ్వర్, ఎంపీటీసీలు అంకం లక్ష్మీ ప్రకాష్, మున్నూరు గంగాధర్,  మాజీ ఎంపీపీ మైదం రాజన్న,చిత్తం మహేష్, మాజీ ఎంపీపీలు బీఆర్‌ఎస్‌ సీనియర్  నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు