
నవతెలంగాణ – బెజ్జంకి
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని ఏఎంసీ మాజీ డైరెక్టర్ పవ్వాడి మల్లికార్జున్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండల పరిధిలోని చీలాపూర్ గ్రామంలో కరపత్రాలతో బోయినిపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను ఓట్లు అభ్యర్థించారు. బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు పంతం శ్రీనివాస్,మండల శ్రీకాంత్,కొంకటి జగన్,లక్ష్మా రెడ్డి,హరీష్,పవ్వాడి శేఖర్,బుగ్గయ్య, జేరిపోతు లక్మన్, సంతోష్ పాల్గొన్నారు.