బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకటరామిరెడ్డి గెలుపు ఖాయం: కేఆర్ భీమసేన

నవతెలంగాణ – రాయపోల్
మెదక్ బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్ధి వెంకట రామిరెడ్డి విజయం ఖాయం అయిపోయిందని మెదక్ పార్లమెంటు నియోకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కెఆర్ భీమసేన అన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13 తేదిన జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట రామిరెడ్డి మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటారని ప్రజలు విశ్వసించారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంతో కొట్లాడి నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పై పోరాడటానికి సరైన నాయకుడు వెంకట రామిరెడ్డి మాత్రమే అని ప్రజలు నమ్ముతున్నారు. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే బీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపు స్పష్టం అవుతోంది అన్నారు.బిజెపి ప్రభుత్వం హిందూ మతోన్మాద ముసుగులో ఓట్లు అడుగుతున్నారు తప్ప దేశ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి,ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం లేదన్నారు. గతంలో ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తీసుకురావడం లాంటి ఎన్నో హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. దేశ జనాభాలో అధిక శాతం హిందువులే ఉంటారని అలాంటి హిందువుల మధ్యనే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుందన్నారు.
ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళు చేయబోయే అభివృద్ధి సంక్షేమం కొత్త పథకాలను ప్రవేశపెడతామని హామీ ఇచ్చి పోటీ చేస్తారని బిజెపి మాత్రం శ్రీరాముడు, హిందూ మతం పేరు చెప్పుకొని ఎన్నికలలో పోటీ చేస్తుందన్నారు.శ్రీరాముడు అందరికీ దేవుడేనని బిజెపి పార్టీ వాళ్లకి మాత్రమే దేవుడు కాదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలలో గెలుపొందిన రఘునందన్ రావు కూడా ఎన్నో హామీలను ఇచ్చి అబద్ధ ప్రచారాలు చేసి గెలుపొందడం జరిగిందని,అది గుర్తించిన ప్రజలు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో గుణపాఠం చెప్పడం జరిగిందన్నారు.దుబ్బాకలో చెల్లని రఘునందన్ మెదక్ లో ఎలా పనికి వస్తారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్రాన్ని సస్యశ్యామలం  చేసి అభివృద్ధి సంక్షేమ రంగాలలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి పది సంవత్సరాలలో సంక్షేమ పాలన అందించడం జరిగిందన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయకుండా ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయి మరిచిపోయి అబద్ధాలు మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్, బీజేపి పార్టీలకు బుద్ధి చెప్పాలని మెదక్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ కి ఓటు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గత 20 సంవత్సరాలుగా కలెక్టర్ గా ఉమ్మడి మెదక్ జిల్లాలో సేవలు అందించారని సేవా దృక్పథం ఉన్న వెంకటరామిరెడ్డిని గెలిపిస్తే మెదక్ నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తారని ప్రజలు భావించారు. కావున మెదక్ ఎంపీగా వెంకట రామిరెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో తొగుట కోఆప్షన్ సభ్యులు కలిమోద్దీన్, బీఆర్ఎస్ నాయకులు ఆస బాబు, జక్కుల రాజు, చింతకింది మంజూర్ తదితరులు పాల్గొన్నారు.