బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి భూ బకాసురుడు: అక్కం స్వామి

– మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి, ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి
నవతెలంగాణ – తొగుట
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి భూ బకా సురుడు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి, ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మండల పరిధిలోని జప్తి లింగారెడ్డి పల్లి గ్రామంలో ఉపాధి హామీ పను ల వద్ద కూలీలతో సమావేశమై మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓట ర్లను అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లా డుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో భాగంగా ఐదు గ్యారంటీలు అమలు చేసిందన్నారు. ఆరవ గ్యారెంటీ రైతు రుణమాఫీ ఆగస్టు 15వ తేదీ లోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చార ని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 కు గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యు త్, ఆరోగ్యశ్రీ పథకం రూ.5 లక్షల నుండి రూ. 10 లక్షల పెంపు తదితర హామీలను అమలు చేసిం దని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన పనిచేస్తుందని మరోసారి నిరూపితం అయిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట రామిరెడ్డి ఒక భూ బకాసురుడు అని రైతుల పట్ల ఆయనకు ఉన్న చిన్న చూపు పలు సందర్భాల్లో బయటపడిందని ఆరోపించారు. రైతుల భూము లు నిర్ధాక్షిణ్యంగా గుంజుకొని అరకురా పరిహారా లు ఇచ్చి బెదిరింపులకు గురిచేసి రైతుల ఆత్మ హత్యలకు కారనమైన వ్యక్తి అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పుతూ 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంద న్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా పదవిలో ఉన్నారని గతంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు కూడా నెరవేర్చ రని అన్నారు. మరో ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, ప్రజలకు ఎలాంటి పని జరగాలన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపించాలని కోరారు. రాష్ట్రంలో లేని, కేంద్రంలో రాణి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్టే అవుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిలువేరి రామ్ రెడ్డి, జిల్లా నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి, గంట రవీందర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, నాయకులు దయాకర్ రెడ్డి, నాగరాజు, మల్లయ్య, చంద్రయ్య, కనకయ్య, సిద్దా రెడ్డి, ఎల్లం, జూపల్లి  స్వామి, కర్నాకర్ రెడ్డి, ఆంజనేయులు, ప్రభాకర్ రెడ్డి, భూపతి రెడ్డి, యతిరాజం తదితరులు పాల్గొన్నారు.