మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ గెలుపు పట్ల బీఆర్ఎస్ సంబరాలు

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మహబూబ్ నగర్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా ఆదివారం  భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా ఆవరణలో బిఆర్ఎస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, టిఆర్ఎస్ భువనగిరి పట్టణ అధ్యక్షులు ఎ వి కిరణ్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, ఇట్టబోయిన గోపాల్, కాజా అజీముద్దీన్, పాండు, నయీముద్దీన్, సురేష్ యాదవ్, బబ్లు, అంజద్ అలీ, సుభాష్, బిక్షపతి, యువ నాయకులు నాగారం సూరజ్, శివ, నరేష్  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.