నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బీఆర్ఎస్ మండల కమిటి ముఖ్య సబ్యులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టు పార్టీ మండల నాయకులు తెలిపారు. ఈ సంధర్భంగా మాజీ జడ్పీటీసి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అద్యక్షుడు మాదారావ్ దేశాయి, వైస్ ప్రసిడంట్ మాజీ విండో చైర్మేన్ పడంపల్లి రాజు పటేల్, జుక్కల్ టౌన్ ప్రసిడెంట్ గోట్కే రాజుపటేల్ తో పాటు వివిధ గ్రామాలకు చెందిన పదమంది మాజీ సర్పంచ్ లు ఇతర ముఖ్యనాయకులు జిల్లా పార్టీ అద్యక్షునికి తమ పదవులకు , సబ్యత్వం రద్దుచేయాలని కోరుతు శుక్రవారం నాడు రాజీనామాల పత్రాలను పంపించడం జర్గిందని తెలిపారు.