నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ సీఎం కేసీఆర్‌ను అసభ్యపదజాలంతో దూషించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. కేసీఆర్‌ను ముక్కలు ముక్కలు చేస్తామంటూ వ్యాఖ్యానించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, గ్రేటర్ హైదరాబాద్ ఇంఛార్జి దాసోజు శ్రావణ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్ తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.