కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టింది

– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కసుబోసులవెంకన్న
నవతెలంగాణ జమ్మికుంట: హైదరాబాద్ తుక్కు గూడా బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాధీ ప్రకటించిన మ్యానిఫెస్టో ను, బీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టి  మ్యానిఫెస్టోను ప్రకటించిందని  కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న అన్నారు. శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపెళ్లి లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బల్మూర్ వెంకట్ రెండేళ్లుగా ప్రజలకు అండగా ఉంటూ, ఆపద సమయంలో ఆదుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని  బలోపేతం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభయ హస్తం ఆరు గ్యారంటీ కార్డులు తప్పకుండా అమలు చేస్తుందన్నారు. మళ్ళీ ఒక సారి తెలంగాణా ప్రజలకు మాయ మాటలు చెప్పె ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్నదని, అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూపిస్తున్నాయని చెప్పారు. ప్రజల నుంచి పార్టీకి  స్పందన వస్తుందన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. గత 2004 లో  సోనియా గాంధీ  అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్,108,104,9 రకాల రేషన్ పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకం, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, రైతులకు ఉచిత విద్యుత్ ఇంకా ఎన్నో బృహత్తర పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందటే మడమ తిప్పదు  అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎండి సలీం పాష,  శ్రీనివాస్, శంకర్,  రాజమౌళి, కొత్తూరి సాగర్,  ప్రభుదాస్, అశోక్,  మురళి,  ప్రకాష్, అంజి తదితరులు పాల్గొన్నారు.