నవతెలంగాణ – ఆర్మూర్
ప్రజాస్వామ్య పద్ధతిలో నిభందనల ప్రకారమే నెగ్గిన అవిశ్వాసం అని హైకోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చినట్టు శుక్రవారం బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు మాజీ చైర్ పర్సన్ వర్గీయులకు చెంప పెట్టు అని,అయినా అవిశ్వాసములో ఓడిన వారికి తగ్గని అధికార, డబ్బు దాహం, ఓడిన వారు రాజ్యాంగానికి విరుద్దంగా చైర్మన్ సీటుపై కూర్చుని కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ వారిపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రజల విశ్వాసం, కౌన్సిలర్ల విశ్వాసం కోల్పోయిన ఆర్మూర్ మున్సిపాలిటీ మాజీ ఛైర్మెన్ గారిపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం, ఈ అవిశ్వాస తీర్మానానికి మెజారిటీ కౌన్సిలర్లు అందరూ హాజరయి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారని, దీనిపై ఆర్డిఓ అవిశ్వాస తీర్మానము నెగ్గినట్టు ప్రకటించారు, ప్రొసీడింగ్స్ ,మినిట్స్ వాటి వివరాలను కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. మీడియా మిత్రులకు అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ఆర్డిఓ తెలిపారని అన్నారు. అన్ని పత్రికల్లో కూడా చాలా స్పష్టంగా నెగ్గిన అవిశ్వాసం అని వార్త రావడం జరిగింది, ఈ విషయములో మాజీ చైర్ పర్సన్ పండిత్ వినీత గారు తమకు తొలగించకుండా స్టే కావాలని హై కోర్టును ఆశ్రయిస్తే వారి రిట్టు పిటిషన్ నెంబర్ 725/24 IA no. 1/24 డిస్మిస్ అయిన విషయాన్నీ కూడా కప్పి పుచ్చి, ఇంత జరిగినా కూడా అధికార దాహముతో, డబ్బు దాహముతో చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి, పదవిని కాపాడుకోవడానికే ప్రస్తుత కాంగ్రెస్ నాయకుల వంచన చేరగా వారు మాజీ చైర్పర్సన్ కుటుంబీకులు చేసిన అక్రమాలు తెలుసుకోకుండా వారికి మద్దతు చేస్తుంటే, అవిశ్వాసం వీగిపోయింది అంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని అన్నారు. అప్రజాస్వామికంగా అధికారులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగానికి పాల్పడటం వారి అధికార దాహానికి అధికార అహంకారానికి పరాకాష్ట. అని ,అధికారులతో కలిసి నిస్సిగ్గుగా అనైతిక చర్యలకు పాల్పపడ్డారు. హై కోర్టులో సీనియర్ న్యాయవాది రవి కిరణ్ రావు గారి ద్వారా న్యాయ పోరాటం చేస్తామని, మేము ప్రజల పక్షాన వుండి అవినీతి పరులపై పోరాడినాము. న్యాయమూర్తి చాలా స్పష్టంగా నిబంధనల ప్రకారమే అవిశ్వాస తీర్మానం నెగ్గిందని తీర్పులో రాసారు. ఈ విషయంలో న్యాయస్థానము లో న్యాయం ఖచ్చితంగా జరుగుతుందని రుజువైంది. లేకుంటే అవినీతి పరుల ఆగడాలకు అంతే వుండకపోతుండే పట్టణ ప్రజల అండదండలతో, ఆశీర్వాదముతో త్వరలో నూతన మున్సిపల్ చైర్మన్ ను ఎన్నుకుంటాం అన్నారు.