కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

నవతెలంగాణ – నాగార్జునసాగర్
నందికొండ మున్సిపాలిటీ లోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన 1వవార్డు కౌన్సిలర్ రమావత్ మంగత నాయక్ మరియు 3వ వార్డు కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్ తో పాటు 500మంది కార్యకర్తలు సోమవారం కాంగ్రెస్ మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. దీనితో త్వరలో జరగబోయే నందికొండ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ కి మార్గం సుగమమైంది. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్,మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ, ఏ.ఐ.బి.ఎస్ సాగర్ పట్టణ అధ్యక్షుడు మోహన్ నాయక్,తుమ్మలపల్లి రంగారెడ్డి,ఉగారాల శ్రీనివాస్,చిన్ని,జంగయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.