స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ దే హవా 

– భూఖ్య జంపన్న బి ఆర్ ఎస్ ములుగు నియోజకవర్గ నాయకులు 
నవతెలంగాణ-గోవిందరావుపేట 
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుందని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ నాయకులు భూక్య జంపన్న అన్నారు.  శనివారం మండలంలోని దుంపలగూడెం గ్రామంలో జంపన్న బంధువులు భూక్య సునీత వెంకట్ స్వామి ఏకైక పుత్రిక వివాహానికి హాజరైన సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడారు. ఆత్మస్థైర్యంతో కార్యకర్తలు నాయకులు ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే మన ప్రధాన అస్త్రంగా మలుచుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మరియు పిఎసిఎస్ డైరెక్టర్ సూది రెడ్డి  స్వప్న లక్ష్మ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులులకావత్ నర్సింహా నాయక్,రుద్రబోయిన మల్లేష్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు,మాజీ సర్పంచ్ మోహన్ అజ్మీరా సురేష్ మండల సీనియర్ నాయకులు,  అజ్మీరా భీక్కు మండల నాయకులు, పోరిక స్వామి గ్రామకమిటి  ప్రధాన కార్యదర్శి, వాంకుడోత్ రాజు సేవాలాల్ సేనా మండల అధ్యక్షులు,  విక్రమ్ యాదవ్, కిట్టు, ములుగు రాజన్న,తదితరులు పాల్గొన్నారు.