బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం షురూ…!

నవతెలంగాణ-పెన్ పహాడ్:
బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మంత్రి జగదీష్ రెడ్డిని మూడవసారి గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని, గెలిచిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి డైరెక్టర్ ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అనంతారం గ్రామంలో గడపగడపకు బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోని వివరిస్తూ జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య ఆధ్వర్యంలో గ్రామంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మేనిఫెస్టోను గ్రామస్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ రేవతి పరంధాములు, గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ల నాగార్జున, పార్టీ మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ మస్తాన్, మాజీ సర్పంచ్ సిహెచ్ నారాయణరెడ్డి, మండల రైసస అధ్యక్షుడు పొదిల నాగార్జున, మామిడి వెంకటయ్య, సైదులు, నాగయ్య, వెంకన్న, జానయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.