లక్ష్మీపురం లో బీఆర్‌ఎస్‌ ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ- గోవిందరావుపేట:
మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు జిల్లెల్ల కొమురయ్య ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ఓటర్లకు వినిపిస్తూ ప్రచారం కొనసాగించారు. సీఎం కేసీఆర్  ప్రవేశపెట్టిన  ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి తెలుపుతూ ప్రతి ఇంటికి అందిన సంక్షేమ  పథకాల వివరిస్తూ  అభివృద్ధి చెందాలంటే ములుగు నియోజకవర్గంలో మన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి కారు గుర్తుకే మనం ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.  కార్యక్రమంలో సర్పంచ్ స్వాతి వాగా, మండల ఉపాధ్యక్షులు జి రామకృష్ణ, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్, సీనియర్ నాయకులు బోదబోయిన ముత్తయ్య, జి రమేష్,ఈక రామారావు, జి సాంబయ్య,  టీ సమ్మయ్య, రామకృష్ణ, గ్రామ ప్రజలు యూత్ వారియర్స్ పార్టీ సైనికులు సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.