పెద్దకొడప్ గల్ మండలంలో3వ తేదీ శుక్రవారం నాడు మండలానికి జుక్కల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే హన్మంత్ షిండే మండలంలో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్లు ఎంపీపీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. వివరాలకై మండలంలోని కాటేపల్లి, కాటే పల్లి తాండ, బేగంపూర్, కాసలబాద్, వడ్లమ్, పెద్ద దేవిసింగ్ తాండ, కుబ్యానాయక్ తాండలకు బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి మన ప్రియతమ నేత జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే ఎన్నికల ప్రచారం చేయడానికి వస్తున్న సందర్భంగా ఆయనకు మండలంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీపీ కోరారు.