గంజాయి ఇసుక మరో మాఫియాను ప్రోత్సహించింది టిఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదిరే స్వామి అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సోమవారం భీంగల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముత్యాల సునీల్ కుమార్ , ఈరవత్రి అనిల్ , మానాల మోహన్ రెడ్డి లను విమర్శించటం, వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమనీ అన్నారు. గత పది సంవత్సరాలలో గంజాయి మాఫియా గాని, ఇసుక మాఫియా గాని మొరం మాఫియా గాని భూకబ్జాలు గాని చేసింది ఎవరో? వాటిని ప్రోత్సహించింది ఎవరో ప్రజలే తెలుసుకొని ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మా నాయకులు గాని మా కార్యకర్తలు గాని, మేం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలపైనే దృష్టి పెడుతూ ప్రజల్లో ఉన్నామన్నారు. ఇప్పటికే నాలుగింటిని నెరవేర్చడం జరిగింది. వరంగల్ లో ఇచ్చిన హామీ ప్రజలకు రెండు లక్షల రుణమాఫీ మా ముఖ్యమంత్రి రెండు దఫాలు మాఫీ చేయడం జరిగిందని.దీంతో రైతులందరూ ఎంత సంతోషంగా ఉన్నారన్నారు. మీ బూటకపు ధర్నాలు, రాష్ట్ర రోకోలు ప్రజలు నమ్మేస్థితిలో లేరని కనుక బిఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని స్వామి తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు జెజె నరసయ్య. జిల్లా సెక్రెటరీ కుంట రమేష్. ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు.మల్లెల లక్ష్మణ్.రాజేష్.నారాయణ.షాదుల్లా.మీరజ్.శ్యామ్ రాజ్.రంజిత్.నవీన్.శ్రీను.నవీద్.ప్రవీణ్.సేవాలాల్.ఆకాష్.చంద్రం.దానిష్.జుబేర్.దిషన్.అజార్.తదితరులు పాల్గొన్నారు.