
నవతెలంగాణ- ధూల్ పేట్: కార్వాన్ లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని నియోజకవర్గం అభ్యర్థి మిత్ర కృష్ణ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మిత్ర కృష్ణకు బీఫామ్ అందజేశారు. దీంతో కార్వాన్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నాయకులు సందడి చేశారు. పార్టీ కేటీఆర్ ఎల్ ఆధ్వర్యంలో మిత్ర కృష్ణ కి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్ ల నాయకులు, పార్టీ శ్రేణులు కలిసి కార్వాన్ దర్బార్ మైసమ్మ గుడిలో కలిసికొని అమ్మవారికి మొక్కి ప్రచార కార్యక్రమం మొదలు పెడదామని మాట్లాడుకున్నారు. పార్టీ శ్రేణులు ఉస్తవాల్లో మునిగి తేలారు.