నీల గ్రామంలో బీఆర్‌ఎస్‌ గడపగడపకు ప్రచారం..

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం నీలా గ్రామంలో బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు గడపగడపకు ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహమ్మద్ షకీల్ అమీర్ ను అత్యధిక సంఖ్యలో తమ ఓట్లు వేసి గెలిపించాలని వారు కోరారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను గడపగడపకు తిరుగుతూ వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రాఘవేందర్, గఫార్, ఖలిద్ తదితరులు పాల్గొన్నారు.