బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి ఉష

నవతెలంగాణ –  ఓదెల:మన ఊరు – మన ఉష కార్యక్రమంలో భాగంగా 9వ రోజున ఓదెల మండలo పొత్కపల్లి గ్రామంలోని హనుమాన్ గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దాసరి ఉష మాట్లాడారు. మన ఊరు – మన ఉష కార్యక్రమంలో ప్రతి ఇంటింటికి బహుజన వాదాన్ని తీసుకెళుతున్న తరుణంలో ఆదివారం రోజున పొత్కపల్లి గ్రామంలో ని యువత ఎండి మోహిన్,శరత్, ఈశ్వర్ ప్రసాద్, కార్తీక్, మహేష్, వర్షిత్, ఆదిత్య, చరణ్, పవన్ కళ్యాణ్, ఎండి జాకీ, ఎండి పాషా 25 మంది వరకు బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు. ముఖ్యంగా పొత్కపల్లి లో తాగునీటి సమస్య ఉందని, యువతకు క్రీడా ప్రాంగణం లేదని,బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ క్రీడ ప్రాంగణం పేరుతో నియోజకవర్గంలో గుట్టల లో, స్మశానవాటికలో, స్కూళ్లకు బోర్డు లు పెట్టి గొప్పలు చెప్పుకుంటుందన్నారు. గెలవకముందు ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత హామీలు నెరవేర్చడలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, రానున్న రోజుల్లో యువతరానికి, మహిళలకు బహుజన సమాజ్ పార్టీ బాట చూపిస్తుందన్నారు

ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దాసరి హనుమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్,అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్, అసెంబ్లీ మహిళా కన్వీనర్ ఆముదల అరుణ,జుల్లపల్లి మండల అధ్యక్షులు సీపెల్లి కొమురయ్య, కాల్వ శ్రీరాంపూర్ మండల అధ్యక్షులు కుమ్మరి కుంట రవికుమార్, ఓదెల మండల కమిటీ సభ్యులు కళ్యాణ మహేష్, కాసర్ల శ్రీనివాస్, ఎండి వాహిద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.