– కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే తోట
నవతెలంగాణ – మద్నూర్
గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారాన్ని చలాయించి రాష్ట్ర అభివృద్ధిని బ్రష్టు పట్టించిందని దాదాపు 8 లక్షల కోట్లు అప్పులు చేసిందని రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీల పథకాలు 100 రోజుల్లో అమలు పరుస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రజలకు హామీ ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం నాడు మండల తాసిల్దార్ ఎండి మూజిక ఆధ్వర్యంలోరైతు వేదికలు నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర అభివృద్ధిని బ్రష్టు పట్టిస్తూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా అద్వ గతి చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటగానే ఆరు గ్యారెంటీలు అమలు ఎక్కడ అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం ఆ పార్టీ నాయకుల మాటలపై ప్రజలు నమ్మరని ఆరు నూరైనా నూరు ఆరైనా ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వంద రోజుల్లో పూర్తి చేస్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలతో ప్రజల్లోకి వెళితే ఎవ్వరు నమ్మరని ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ లతో పాటు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ వైస్ ఎంపీపీ జైపాల్ రెడ్డి ఎంపీటీసీ సంగీత కుశాల్ స్థానిక సర్పంచ్ సురేష్ ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్ వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్యాణ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొనగా మద్నూర్ మండలంలో మొత్తం 52 చెక్కులు పంపిణీ చేశారు.