– బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకులు సయ్యద్ ఖలీల్
నవతెలంగాణ-ఆమనగల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేస్తుందని బీఆర్‌ఎస్ మైనార్టీ నాయ కులు సయ్యద్ ఖలీల్ అన్నారు. శని వారం బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు, యువత జీవనోపాధికి రూ.లక్షా, షాదీ ముబారక్, గురుకుల పాఠశాలలు, ఇమామ్ మౌజమ్ లకు గౌరవ వేతనాలు తదితర సంక్షేమ పథకాలను అమలు చేసిన బీఆర్‌ఎస్‌కు మైనార్టీలు అండగా నిలిచి కల్వకుర్తి అభ్యర్థి జైపాల్ యాదవ్‌ను మరోసారి గెలిపిం చాలని కోరారు. ఈ సమావేశంలో ఎం.డి.జహాంగీర్, అబ్బు, మహబూబ్, మోహీజ్, షరీఫ్, ఫారూఖ్, బాబా, నసీరుద్దీన్, అఫ్సర్, హనీఫ్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.