– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణ కేంద్రంలోని చెందిన లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజ ేశారు. నియోజకవర్గంలోని 45 మంది లబ్దిదారులకు రూ.29 లక్షల 14 వేల సీఎంఅర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులందరూ సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను మంజూరు చేసి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.