
– తుడుండెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవిందర్
నవతెలంగాణ- మల్హర్ రావు: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆదివాసీ గిరిజనులకు చేసింది శూన్యమని, సంక్షేమం, అభివృద్ధి అందని ద్రాక్షగానే మిగిలిందని తుడుండెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవిందర్ ఆరోపించారు. ఆదివారం మండలంలోని కొయ్యుర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గత ప్రభుత్వాలు అమలు చేసిన అటవీ హక్కుల చట్టం గానీ, ఇందిరమ్మ ఇండ్లు గాని ఆదివాసులకి అందకపోగా కేసీఆర్ ప్రభుత్వం పంటి కింద ఇసుకరాయిలాగా తయారు చేసిందన్నారు. ఆదివాసులపై కపట ప్రేమచూపుకుంటూ పోడు భూములకు చట్ట బద్దత ఇవ్వకుండా, విద్య, వైద్యానికి దూరం చేస్తూ నిర్బంధ నీడలలో ఉంచుతూ, కేసీఆర్ మళ్లీ గద్దెనెక్కే ప్రయత్నంలో ఆదివాసీల ఓట్లను కాజేసే చేసే ప్రయత్నంలో తల మునుకలై తీవ్రస్థాయిలో కృషి చేస్తోందన్నారు. గిరిజనులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కనీసం మనుషులుగా గుర్తించని తమ ఓట్లు అడుగడానికి ఏ విదంగా ముందుకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు మొదటి సారి గద్దెనెక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం జెలిగాలంచలో బట్టలు గిరిజనుల బట్టలిప్పేసి దాడి చేసిందని, కాగజ్ నగర్ లో పశువుల కన్నా హీనంగా బంజారదొట్లో బందించిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఆదివాసీ ప్రజలారా మోసపోకండని, ప్రభుత్వం కనీసం బావా స్వేచ్ఛ ప్రకటన లేకుండా మాట్లాడే వారిపై దాడులు ప్రోత్సహిస్తుందని, అనగ తొక్కలని చూస్తుందని, గతంలో కొమురం బీమ్ పోరాటాన్ని పోరాటాన్ని ఆదర్శం గా తీసుకోవాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. ఓట్ల రాజకీయం చేసీ ప్రభుత్వం గద్దెనేకింది రెండో దప గెలిచినా ఇప్పటి వరకు ఐటిడిఏ మీద ఆలోచన లేదన్నారు. మైదాన ప్రాంత ఆదివాసీల పరిస్థితి ఆదోవిదంగా ఉంది కనుక ఆదివాసీ ప్రజలారా మైదాన ప్రాంత ఆదివాసీలకు ఏజెన్సీ చట్టాలు అమలు చేసే విదంగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని, గ్రూప్ 1.2 పరిస్థితి ఆగమైంది ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు కూడా అమలు చేయలేదు బహుళ జాతి కంపనికి అటవీ భూములు ధరదత్తం గిరిజన ఆశ్రమ పాఠశాలల, ఉద్యోగాలు దళారుల చేతుల్లో అమ్ముడు పోయినని, రానున్న ప్రభుత్వలు ఆదివాసీ ల సానుకూలంగా వ్యవహరించాలని తుడుం దెబ్బ డిమాండ్ చేస్తోందన్నారు. ఓటు ద్వారావకేజ్ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పీకే కిరణ్, ఆక్కల బాపు యాదవ్, ఆదివాసీ మహిళ నాయకురాలు కుడిమెత సరస్వతి, ఆదివాసీ విద్యార్ధి నాయకురాలు ఆకుల లలిత పాల్గొన్నారు.