బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు, బీజేపీకి ఆదరణ లేదు: బీర్ల ఐలయ్య

– కేసీఆర్ దుకాణం బంద్, రాముని పేరు చెప్పి దొంగ రాజకీయాలు చేస్తున్న బీజేపీ
నవతెలంగాణ – బొమ్మలరామారం
బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు,బిజెపికి ఆదరణ లేదని, రాములు పేరు చెప్పి దొంగ రాజకీయాలు చేస్తున్న బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బూత్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ..భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పనిచేయాలని పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తింపు దక్కుతుందని కొత్త పాత అనే తేడా లేకుండా కార్యకర్తలంతా సైనికుల పనిచేసి భువనగిరి ఎంపీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో 75 వేల ఒట్ల మెజార్టీని తీసుకువచ్చి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ బలాన్ని నిరూపించాల్సిన అవసరం ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ తోనే కెసిఆర్ దుకాణం బంద్ అయింది అని, మా నాన్నల కాలం నుండి రాములవారిని పూజ చేస్తున్నామని, కొత్తగా బిజెపి ప్రభుత్వం రాముని గురించి చెప్పడం సిగ్గుచేటు అన్నారు.పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని కాలేశ్వరం తో ప్రజల సొమ్మును దోచుకుంటే, నరేంద్ర మోడీ కేసీఆర్ ను ఏమి చేయలేదని, ఇద్దరు ఒకటేనని పేదలకు చేసేది ఏమీ లేదని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి చీర్ల రాజేశ్వర్, మాజీ ఎంపీపీ తిరుపతిరెడ్డి, మాజీ సింగల్ విండో చైర్మన్ మోకు మధుసూదన్ రెడ్డి, ఎంపిటిసి హేమంత్ రెడ్డి,శ్రీహరి నాయక్, మాజీ సర్పంచ్ చీర సత్యనారాయణ, మర్రి భగవంతు రెడ్డి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్, బొబ్బిలి నర్సిరెడ్డి, యూత్ అధ్యక్షులు శ్రావణ్ ప్రసాద్ రెడ్డి, నాయకులు, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, యనగంట్ల వీరేశం, కూకుట్ల ఈశ్వర్ యాదవ్,నందురాజ్ గౌడ్, రామిడి రామ్ రెడ్డి, ఈశ్వర్, జూపల్లి లింగం,గ్రామ శాఖ అధ్యక్షులు పైలెట్ రాజేష్, జూపల్లి శ్రీకాంత్, తునికి మహేష్, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.