పార్టీలో చేర్చుకోవడంలో కాంగ్రెస్‌.. ప్రచారంలో బీఆర్‌ఎస్‌!

నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులను ఆయా పార్టీలకు చెందిన అధిష్టానం ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ గత నెలలో అభ్యర్థిగా రమావత్‌ రవీంద్ర కుమార్‌ను ప్రకటించింది. గత నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్‌ అభ్యర్థిగా బాలునాయకును ప్రకటించింది. కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించక ముందే బి ఆర్‌ఎస్‌ అభ్యర్థి రమావత్‌ రవీంద్ర కుమార్‌ నియోజకవర్గంలోని 7 మండలాలలో మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. గత నెల 31వ తేదీన సీఎం కేసీఆర్‌ తో భారీ బహిరంగ సభను నిర్వహిం చి ప్రచారం చేపట్టారు .బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలి రావడంతో బి ఆర్‌ఎస్‌ పార్టీలో ఉత్సవం పెరిగింది. ఎమ్మెల్యే పై అసమతిగా ఉన్న కొంతమంది నాయకులు కారును వదిలి చెయ్యి పట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బాలునాయకుని ప్రకటించడంతో ద్వితీయ శ్రేణి నాయకులంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. బి ఆర్‌ఎస్‌ పార్టీ రెండో విడత ప్రచారంలో నిమగం కాగా, కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీలకు చెందిన నాయకులను, కార్యకర్తలను పార్టీలో చేర్చుకునే పనిలో నిమగమైంది .ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న నాయకులంతా క్యూ కట్టి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. ప్రచారం కన్నా పార్టీలో చేసుకునే పైనే కాంగ్రెస్‌ దష్టి పెట్టింది. రోజులవారిగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయి ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండడంతో ఆ పార్టీలో ఉత్సాహం మరింత పెరిగింది .గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తుంది. బి ఆర్‌ఎస్‌ పార్టీపై అసంతప్తి ఉన్న నాయకుల సర్పంచుల, ఎంపీటీసీల వద్దకు వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తూ, కండువాలు కప్పుతున్నారు .పార్టీలో చేర్చుకునే భాగంలోనే ప్రచారం కొనసాగిస్తున్నామని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. బి ఆర్‌ఎస్‌ పార్టీ పై అలిగిన కొంతమంది నాయకులను పార్టీ అధిష్టానం, జిల్లా మంత్రి బుజ్జగించిన వినకపోవడంతో వారిని వదిలేసింది .దీంతో వారు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ మెంబర్‌ వడ్త్యా రమేష్‌ నాయక మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో బి ఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. రమేష్‌ దేవరకొండ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ,టికెట్‌ దక్కకపోవడంతో పార్టీ మారారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుండి దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే రమేష్‌ కు కాంగ్రెస్‌ టికెట్‌ కావాలని సినీ యాక్టర్‌ చిరంజీవి ప్రయత్నం చేసినప్పటికీ టికెట్‌ దక్కలేదు .దీంతో ఆయన బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు .పట్టణంలో బి ఆర్‌ఎస్‌ 9వ వార్డు కౌన్సిలర్‌ హనుమంతు వెంకటేష్‌ గౌడ్‌ పార్టీ మారుతాడని పుకార్లు రావడంతో బుధవారం మంత్రి కేటీఆర్‌ దగ్గరికి తీసుకెళ్లి నచ్చ చెప్పారు. దీంతో ఆయన తాను పార్టీ మారడం లేదని ,నేడు సాయి శివ గార్డెన్‌ లో ఆత్మీయ సమ్మేళనం చేపట్టనున్నట్లు ప్రకటించారు.పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌ రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. గురువారం దేవరకొండ బిజెపి అభ్యర్థిగా కేతవత్‌ లాలునాయకును ప్రకటించింది. అయితే ఆయనను ప్రకటించక ముందే నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. లాలూ నాయక్‌ 2014లో బి ఆర్‌ఎస్‌ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌, సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి రమావత్‌ రవీంద్ర కుమార్‌ గెలుపొందారు. అనంతరం లాలు నాయక్‌ బిజెపి పార్టీలో చేరారు.