– ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
– అభివృద్ధికి ఆకర్షితులపై పార్టీలో చేరికలు
నవతెలంగాణ-యాచారం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం యాచారం మండల పరిధిలోని చింతపట్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అండతో ఇబ్రహీంపట్నం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ సబండ వర్గాల వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశంలోనే నెంబర్ వన్‌గా అమలవుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, చింతపట్ల పార్టీ నాయకులు లిక్కి నర్సిరెడ్డి, లక్ష్మారెడ్డి, సింగారం వెంకటయ్య, శ్రీశైలం, పార్టీలో చేరిన వారు తదితరులు పాల్గొన్నారు.