సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌దే

– ఆరు గ్యారెంటీలు వారంటీ లేని పథకం
– కాంగ్రెస్‌ కల్లబొల్లి మాటలు నమ్మొద్దు
– కారు గుర్తుకు ఓటేద్దాం..గద్వాలను అభివద్ధి చేసుకుందాం
– నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిని గెలిపిద్దాం కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం
– ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్‌ రెడ్డి, ఎంపీ అభ్యర్థి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
ధరూర్‌: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని ఎమ్మెల్యే బండ్ల కష్ణ మోహన్‌ రెడ్డి ఎంపీ అభ్యర్థి ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం గద్వాల నియోజకవర్గం ధరూర్‌ మండల కేంద్రంలో నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బాగంగా ఎమ్మెల్యే బండ్ల కష్ణ మోహన్‌ రెడ్డి ఎంపీ అభ్యర్థి ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రంతో పాటు గ్రా మాలు అభివద్ధి చెందాయన్నారు. గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే గ్రామాల్లో సరైన సదుపాయాలు లేక ప్రజలు ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని అన్నారు.రైతులకు నీళ్లు , కరెంటు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదని మళ్లీ ఎంపీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ మీ ముందుకు వస్తుందన్నారు.పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ నేను కూడా నడిగడ్డ వాసిని , బహుజన బిడ్డని, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివద్ధి చెందినట్లు పేర్కొన్నారు. బీఆర్‌ ఎస్‌ పాలన లో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం జరిగిందన్నారు. తనను నాగర్కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా గెలిపిస్తే ఢిల్లీలో మీ తరఫున ప్రశ్నించే గొంతు అవుతానని, గ్రామీణ ప్రాంతా లలోని విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే విధంగా కషి చేస్తానని తెలిపారు. త్వరలోనే జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికలలో మే 13వ తేదీన కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు మహిళలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థికి ఘన స్వాగతం పలికారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర సీనియర్‌ నాయకులు నాగర్‌ దొడ్డి వెంకట్రాములు, బీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్‌ నాయకులు గడ్డం కష్ణారెడ్డి , పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి, జెడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు డీ.ఆర్‌ విజరు, ఉరుకుందు, రామకష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి, వెంకటేశ్వర్‌ రెడ్డి, వెంకటరామిరెడ్డి, సత్యం రెడ్డి, చక్రధర్‌ రావు, రఘువర్ధన్‌ రెడ్డి, ప్రభాకర్‌ గౌడ్‌, డీి.వై రామన్న, ఈశ్వరయ్య, రంగస్వామి, శ్రీరాములు, రాఘవేందర్‌ రెడ్డి, భీమ్‌ రెడ్డి, హనుమంతు రెడ్డి, భగీరథ వంశీ, కురుమన్న, అంజి సాగర్‌, మల్లికార్జున్‌ రెడ్డి, అంబ్రహం , నాసిర్‌, పురుషోత్తం రెడ్డి , భరత్‌ సింహా రెడ్డి, సంజీవ్‌, నాయకులు , కార్యకర్తలు , యూత్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .